16 సినిమాలకు దర్శకత్వం వహించిన జి. నాగేశ్వరరెడ్డి సొంతూరైన కర్నూలు జిల్లా కోడుమూరులో సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పనులు 40 శాతం పూర్తయ్యాయని, మరో రెండేళ్లలో నిర్మాణం పూర్తి కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం మహేశ్వరరెడ్డి, హనుమంత రెడ్డి, రాజశేఖర్, శ్రావణ్, సూర్యారెడ్డి తదితరులు శాలువాతో ఆయన్ని సన్మానించారు.
ఇవీ చూడండి...