ETV Bharat / state

కర్నూలులో ఆమానవీయం..ఎక్స్​రే కోసం స్ట్రెచర్​పై

కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించిన ఘటన కర్నూలులో జరిగింది. ఆస్పత్రిలో చేరిన వృద్ధుడిని ఎక్స్​రే కోసం బయటికి పంపించడం కలకలం సృష్టించింది.

crusial insident in kurnool
కర్నూలులో ఆమానవీయ ఘటన...ఎక్స్​రే కోసం స్ట్రెచర్​పై
author img

By

Published : Jul 17, 2020, 7:19 PM IST

Updated : Jul 17, 2020, 8:57 PM IST

కర్నూలులో ఆమానవీయ ఘటన...ఎక్స్​రేకి స్ట్రెచర్​పై

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన ఓ వృద్ధుడి పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించింది. ఆస్పత్రిలో చేరిన వ్యక్తిని ఎక్స్​రే కోసం బయటికి పంపించారు. దీంతో రోగి బంధువులు అతన్ని స్ట్రెచర్​పై తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితం కావాలని అధికారులు చెబుతుంటే..అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన వృద్ధుడిని బయటకు పంపించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కి రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడ చికిత్స కోసం వస్తుంటారు.... ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రి గా మార్చడంతో ఇతర వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రధాన ఆసుపత్రి పక్కనే ఉన్న కంటి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈక్రమంలో అక్కడ వైద్య పరికరాల కోరత ఉండడంతో రోగులు వివిధ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి నుంచి బయటికి వెళ్తున్నారు. వైద్య పరీక్షల కోసం బయటికి వెళ్లే వారిని అంబులెన్స్ లో తీసుకెళితే బాగుంటుందని స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి: వేటగాళ్లను అరెస్ట్ చేసిన అటవీ శాఖ అధికారులు

Last Updated : Jul 17, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.