కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. రేపు రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ(cpi ramakrishna) తెలిపారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. రేపు అన్ని పట్టణాలు, నగరాల్లో నిరసనలు చేపడతామని వివరించారు. రాష్ట్రంలో కేసీఆర్(telangana cm kcr) పార్టీ పెడతా అంటున్నారని.. దానికి గల అర్హతలేంటో కేసీఆర్ చెప్పాలని అన్నారు.
ఇదీ చదవండి:
NARA LOKESH: 'వృద్ధులపై దాడులు దారుణం.. వైకాపా పనైపోయింది..!'