ETV Bharat / state

శ్రీశైలం దేవస్థానంలో బదిలీల వేటు తప్పదా..?

శ్రీశైలం దేవస్థానంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందోనని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రూ.కోట్లు నిధులు పక్కదారి పట్టినట్లు విచారణ ద్వారా వెలుగు చూడటంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. పొరుగు సేవల సిబ్బంది చేసిన అవినీతి తతంగం రెగ్యులర్‌ ఉద్యోగుల మెడకు చుట్టుకునే అవకాశం ఉంది.

corruption in  srisailam temple
శ్రీశైల దేవస్థానంలో బదిలీల వేటు తప్పదా?
author img

By

Published : May 31, 2020, 6:02 PM IST

శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. బదిలీల వేటు తప్పదని చర్చించుకుంటున్నారు. 2016లో జరిగిన సాధారణ బదిలీల్లో దాదాపు 28 మంది ఇతర దేవస్థానాలకు వెళ్లారు. వీరిలో చాలా మంది అక్కడే 3, నాలుగేళ్లు పనిచేసి శ్రీశైల దేవస్థానానికి వచ్చారు. దేవాదాయ శాఖలో పైరవీలతో కొందరు స్వల్ప కాలంలోనే సొంత గూటికి చేరుకున్నారు. ఇక్కడికి వారు వచ్చాక యథావిధిగా తమ ధోరణితో వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఎలా...

అభిషేకం టిక్కెట్ల సొమ్ము, విరాళాలు, పెట్రోల్‌ బంక్‌ నిధులు పక్కదారి పట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేవాదాయ, పోలీసు శాఖలతో విచారణ చేపట్టింది. నివేదికలు ప్రభుత్వానికి చేరగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం బదిలీలపై ఉంటుందా? లేదా? అనే అంశంపై మథనపడుతున్నారు.

సాంకేతికతకు భద్రత కరవు

సాఫ్ట్​వేర్ దుర్వినియోగం చేసి అభిషేకం టిక్కెట్ల సొమ్మును పొరుగు సేవల సిబ్బంది స్వాహా చేయడం కలకలం రేపింది. సర్వర్‌ రూం కంప్యూటర్‌ ఆపరేటర్ల కళ్లుగప్పి ఈ దందా చేయడం నమ్మశక్యంకాని విషయం. మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను దుర్వినియోగం చేస్తూ... చలామణి అవుతున్నా ఎవరూ గుర్తించలేకపోయారు. కేవలం ఒక్క ఫిర్యాదుతో లోతుగా విచారణ చేసి అక్రమాలను గుర్తించారు.

corruption in  srisailam temple
శ్రీశైల దేవస్థానంలో బదిలీల వేటు తప్పదా..?

ఎందుకు పట్టుకోలేకపోయారు!

సాఫ్ట్‌వేర్‌లో జరిగిన లొసుగులను బయటపెట్టాలని ఈవో రామారావు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ అవినీతి తంతు బయటపడింది. అసలు దేవస్థానం సాఫ్ట్‌వేర్‌లకు స్వీయ రక్షణ లేకపోవడం, ఆన్‌లైన్‌ విధానానికే గండికొట్టడం చిన్న విషయం కాదు. అభిషేకం టిక్కెట్ల గోల్‌మాల్‌కు సూత్రధారిగా భావించే దర్షిల్లీ అనే వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. మరి రెండేళ్ల నుంచి ఆర్జిత టిక్కెట్‌ కౌంటర్లలో అక్రమాలు జరుగుతుంటే... ఎందుకు పట్టుకోలేకపోయారన్న సందేహం తలెత్తుతోంది. కంప్యూటర్లలో టిక్కెట్లు మాయమవుతున్న విషయం సర్వర్‌ రూం కంప్యూటర్లు ఎందుకు గుర్తించలేకపోతున్నారు. పదేళ్ల క్రితం కంప్యూటర్‌ టిక్కెట్ల ద్వారా విక్రయించిన లడ్డూ ప్రసాదాల సొమ్ము స్వాహా అయితే అక్రమాలను పసిగట్టలేకపోయారు. ఇలా దేవస్థానం సాఫ్ట్‌వేర్‌ భద్రత, నిర్వహణ కొత్త సవాళ్లకు దారి తీసింది.

నాటి ఆదేశాలు బుట్టదాఖలు

దేవస్థానాల్లో లోటుపాట్లను గుర్తించి అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్‌, ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్వీ ప్రసాద్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌.సీ.B1/19555/2011లో శ్రీశైల దేవస్థానానికి కొత్త క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ మంజూరు చేశారు. శ్రీశైల దేవస్థానం రోజురోజుకు అభివృద్ధి చెందడం వలన భక్తుల ఆకాంక్షలకు తగ్గట్లుగా కొత్త పోస్టులను ఏర్పాటు చేశారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో దేవస్థానం గుమస్తాలను నియమించవద్దని పక్కాగా సూచించారు. కానీ ఆ ఆదేశాలనే తమకు అనుగుణంగా మల్చుకుని హవా కొనసాగిస్తున్నారు. నాటి పోస్టుల్లో ఐటీ ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్‌ సెక్షన్‌, లీగల్‌, పబ్లిక్‌ రిలేషన్‌ విభాగాలు మంజూరు చేశారు. ఐటీ విభాగంలో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లను మంజూరు చేసి ఆర్జిత సేవలు, అకౌంట్స్‌, వసతి, రిసెప్షన్‌, నిర్వహణ చూసుకోవాలని ఆదేశాలున్నాయి. ఇంత పక్కాగా ఆదేశాలున్నా ఆర్జిత అభిషేకాల్లో రూ.1.42 కోట్ల అవినీతి జరగడం విడ్డూరమే.

స్వాహా సొమ్ముతో జల్సాలు!

శ్రీశైల దేవస్థానంలో రూ.1.42 కోట్ల అభిషేకం టిక్కెట్ల సొమ్ము స్వాహా కేసు తుది దశకు చేరింది. బ్యాంకుల ద్వారా పని చేసిన పొరుగు సేవల సిబ్బందిపై కేసు నమోదు చేసి ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ జరుగుతోంది. పొరుగు సేవల సిబ్బందే ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాహా సొమ్మును జల్సాలకు, సొంత ఖర్చులకు నిందితులు వాడుకున్నట్లు సమాచారం. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో గోవా వంటి ప్రాంతాలు కూడా వెళ్లేవారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీశైలంలో ముగిసిన ఏడీసీ విచారణ

శ్రీశైలంలో 4 రోజులపాటు సాగిన దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ విచారణ ఈనెల 30న ముగిసింది. దర్శనం, అభిషేకం టికెట్లు, విరాళాలు, పెట్రోల్‌ బంకుల్లో అవినీతి, అక్రమాలపై అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్జిత అభిషేకాల్లో రూ.1.42 కోట్ల నిధులు పక్క దారి పట్టడం, సుమారు రూ.68 లక్షల నిధులను ముగ్గురు ఒప్పంద ఉద్యోగులు కాజేసిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేశారు. పెట్రోల్‌ బంక్‌లో రూ.40 లక్షల స్వాహాపై విచారించారు. 2016 నుంచి ఇప్పటి వరకు పని చేసిన ఏఈఓలు, పర్యవేక్షకులు, సీనియర్‌ అసిస్టెంట్లు నుంచి వివరాలు రాబట్టారు. 4 రోజులుగా విచారణ చేసి దేవాదాయ శాఖ కమిషనర్‌ చంద్రమోహన్‌ తిరిగి విజయవాడ వెళ్లిపోయారు. విచారణ నివేదికను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు.

ఇవీ చదవండి... లెక్కుంది.. లెక్కలేకుంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.