ETV Bharat / state

వైభవంగా రాఘవేంద్ర స్వామి పట్టాభిషేకం.. బంగారు నాణేెలు, ముత్యాలతో అభిషేకం - రాఘవేంద్రస్వామి 400వ పట్టాభిషేకం మహోత్సవం వార్తలు

కర్నూలు జిల్లాలోని మంత్రాలయ క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజు రాఘవేంద్రస్వామి 400వ పట్టాభిషేకం మహోత్సవంలో భాగంగా.. మఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పాదుకలకు బంగారు నాణేలు, ముత్యాలు, గులాబి, చామంతి పుష్పాలతో అభిషేకం నిర్వహించారు.

Coronation process to raghavendra swamy at mantralayam in kurnool
పాదుకలకు బంగారు నాణేలతో అభిషేకం
author img

By

Published : Mar 16, 2021, 10:39 AM IST

కర్నూలు జిల్లాలోని మంత్రాలయ క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండోరోజు రాఘవేంద్రస్వామి 400వ పట్టాభిషేకం మహోత్సవం కనుల పండువగా సాగింది. బంగారు సింహాసనంలో రాఘవేంద్ర స్వామి పాదుకలను ఉంచారు. మఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పాదుకలకు బంగారు నాణేలు, ముత్యాలు, గులాబి, చామంతి పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి పాదుకలను భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

స్వామి వెండి కవచాన్ని, పాదుకలను బంగారు రథంపై, గ్రంథాలను బంగారు పల్లకిలో ఉంచి మఠం వీధుల్లో వేలాది భక్తుల మధ్య ఘనంగా విహరింపజేశారు. పట్టాభిషేకంలో తెలుగు, కన్నడలో ముద్రించిన పంచాంగాన్ని విడుదల చేశారు. ఉదయం ప్రాకారంలో జ్ఞానయజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. కొత్తగా ప్రతిష్ఠించిన 32 అడుగుల ఏకశిలా అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నిర్వహించారు. హనుమంతుడిని 50 లీటర్ల పాలు, పెరుగు, పంచదారతో అభిషేకించారు.

రామ మందిర నిర్మాణం

శ్రీరామ మందిరం, 50 అడుగుల రామ విగ్రహానికి శంకుస్థాపన, అభయాంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా శ్రీరామ మందిరం నిర్మించాలని పీఠాధిపతి సంకల్పించారు. దీనికోసం భూమి పూజ చేశారు. 50 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మందిరం సైతం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు కృష్ణమూర్తి అనే దాత రూ.3 కోట్లను ఇచ్చేందుకు అంగీకరించారు. మిగిలిన రూ.2 కోట్లను వివిధ భక్తుల ద్వారా సేకరించనున్నారు.

ఇదీ చదవండి:

సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.