ETV Bharat / state

బనగానపల్లెకు కేంద్ర బృందం.. కరోనా నివారణపై దృష్టి - kurnool district latest covid news

బనగానపల్లెలో కరోనా వైరస్ వ్యాప్తి పరిశీలక​ కేంద్ర బృందం పర్యటించింది. అధికారులతో సమావేశమైంది. అనంతరం.. కొవిడ్​ బారినపడి నయమైన రోగుల వివరాలను బృంద సభ్యులు తెలుసుకున్నారు. రెడ్​జోన్​ ప్రాంతాల్లో పర్యటించారు.

corona virus special team from central visits kurnool district
బనగానపల్లెలో పర్యటించిన కొవిడ్​ కేంద్ర బృందం
author img

By

Published : May 20, 2020, 7:47 AM IST

కర్నూలు జిల్లా బనగానపల్లెలో కరోనా వైరస్ కేంద్ర బృందం సభ్యులు మధుమిత దుబే, సంజయ్ కుమార్, సాధుఖాన్​లు పర్యటించారు. బనగానపల్లె పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు. లాక్‌డౌన్‌ అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై మాట్లాడారు.

కరోనా నుంచి కోలుకున్న కుటుంబాల వివరాల తెలుసుకున్నారు. అనంతరం రెడ్​జోన్ ప్రాంతాల్లో పర్యటించి... ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి వైరస్ నివారణకు చేయూత ఇవ్వాలని కోరారు. అనంతరం యాగంటి బయలుదేరి వెళ్లారు.

ఇదీ చదవండి:

విదేశాల నుంచి విశాఖ రానున్న 4 విమానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.