కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు. అనంతరం కార్యాలయాన్ని శానిటేషన్ చేస్తున్నారు. దీంతో వివిధ పనుల నిమిత్తం నగర పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన ప్రజలు వెనెక్కివెళ్తున్నారు. కేవలం నీటి, ఆస్థి పన్నుల కేంద్రాలను మాత్రమే తెరిచి.. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి పన్నులు కట్టించుకుంటున్నారు. కరోనా కారణంగా కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం మూత పడడం ఇది రెండోసారి.
ఇదీ చదవండి: దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు