ETV Bharat / state

ఒండుట్ల పంచాయతీలో ఓటరు జాబితాపై వివాదం

గడివేముల మండలంలోని ఒండుట్ల పంచాయతీలో ఓటరు జాబితాపై వివాదం నెలకొంది. పాత జాబితా ప్రకారం 848 ఓట్లు ఉండగా కొత్తగా 88 ఓట్లు చేర్చారు. కొత్తగా చేర్చిన ఓట్లకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు పంచలేదు. ఫలితంగా జాబితాపై వివాదం నెలకొంది.

Controversy over voter list
ఓటరు జాబితాపై వివాదం
author img

By

Published : Feb 14, 2021, 3:19 PM IST

కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని ఒండుట్ల పంచాయతీలో ఓటరు జాబితాపై వివాదం నెలకొంది. పాత జాబితా ప్రకారం 848 ఓట్లు ఉండగా కొత్తగా 88 ఓట్లు చేర్చారు. మొత్తం 936 మంది ఓటర్లతో ఎన్నికలు జరిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్తగా చేర్చిన ఓట్లకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు పంచలేదు. పోలింగ్‌ రోజున కొత్తగా జాబితాలోనివారు ఓట్లు వేసేందుకు రాగా... ఓవర్గం వారు అడ్డుకున్నారు.

ఓటరు జాబితాలో వరుస సంఖ్యను పెన్నుతో రాశారంటూ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొంతసేపు పోలింగ్‌ ఆగిపోయింది. వారిని పక్కనపెట్టి పాత జాబితా ప్రకారం ఓట్లు వేయించారు. చివర్లో అధికారులు వారికి నచ్చజెప్పి... కొత్త ఓటర్లకు అవకాశమిచ్చారు.

ఇదీ చదవండి:

వెన్నుచూప‌ని పోరాటంతోనే పంచాయ‌తీల్లో ప‌ట్టు సాధించాం:లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.