కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం కోట కందుకూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవం సందర్భంగా జరిగిన తిరునాళ్లలో గొడవ జరిగింది. దుకాణాల వద్ద వస్తువులను కొనుగోలు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల కొందరు అసభ్యంగా వ్యవహరించారని ఒకరిపై మరొకరు దాడులకు దిగారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పార్వేట ఉత్సవం సందర్భంగా తిరునాళ్లు జరిగే ప్రతి గ్రామంలో ఇకపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: బ్యాంక్లో చోరీకి యత్నం.. డాక్యుమెంట్లు చెల్లా చెదురు