కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. తరుచూ ప్రమాదాలకు కారణమైన ఆగ్రో పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో ప్రమాదం జరిగితే స్పందించిన ప్రభుత్వం.. నంద్యాలలో జరిగితే ఎందుకు పట్దించుకోవట్లేదని వారు ప్రశ్నించారు. రాయలసీమపై వివక్ష చూపడం తగదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మీ నరసింహ యాదవ్ అన్నారు. పరిశ్రమలో వేడినీళ్ల పైపు పగిలి మృతి చెందిన లక్ష్మణమూర్తి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.
విజయవాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌పై 'దిశా' స్టేషన్లో ఫిర్యాదు