కర్నూలు అల్ట్రా మెగా సోలార్ పార్కు సిబ్బందిని తుపాకీతో బెదిరించిన కేసులో నలుగురు వైకాపా నాయకులపై కేసు నమోదైంది. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివానందరెడ్డి, లోక్నాథ్ రెడ్డి, మంచాలకట్ట గ్రామానికి చెందిన మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి.. గురువారం సోలార్ పార్కులోకి వెళ్లారు. తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని బెదిరించారని సిబ్బంది ఆరోపించారు.
స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉద్యోగులను తుపాకీతో బెదిరించడంపై... సిబ్బంది గడివేముల పోలీసులను ఆశ్రయించారు. నంజుండప్ప అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై సెక్షన్ 447, 506, 384 రెడ్ విత్ 511 మారణాయుధాల చట్టంలోని సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి : కాంట్రాక్టు ఇవ్వాల్సిందే... తుపాకీతో వైకాపా నేత బెదిరింపు!