ETV Bharat / state

కుప్పగల్లులో కుల వివక్ష.. కలెక్టర్, ఎస్పీ ఆగ్రహం

అది కుప్పగల్లు గ్రామం. ఆ గ్రామంలో షెడ్యూల్డ్ కులస్థులు క్షవరం కోసం హెయిర్ కటింగ్ సెలూన్​లకు వెళ్తే వారికి నిరాశే ఎదురవుతోంది. మిగతా కులాలకు అందినట్లు వారికి నాయీ బ్రాహ్మణ సేవలు లభించట్లేదు. మరోపక్క టీ కొట్లోనూ వీరికి ఒక రకం గ్లాసులు, మిగతా వారికి మరో రకం గ్లాసులను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్, ఎస్పీతో కలిసి గ్రామాన్ని సందర్శించారు.

కుప్పగల్లులో కుల వివక్ష.. హెచ్చరించిన కలెక్టర్, ఎస్పీ

author img

By

Published : Oct 6, 2020, 6:29 PM IST

కర్నూలు జిల్లా కుప్పగల్లు గ్రామంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ ఫకీరప్ప పర్యటించారు. ఆదోని మండలం కుప్పగల్లు గ్రామంలో కుల వివక్షపై సభ ఏర్పాటు చేశారు. గ్రామంలో కులాలు పట్టించుకోకుండా ప్రజలంతా కలిసి మెలిసి ఉండాలని కలెక్టర్ సూచించారు. సోదరభావంతో మెలగాలని అవగాహన కల్పించారు. గత కొన్ని ఏళ్లుగా నాయి బ్రాహ్మణులు, గ్రామంలోని ఎస్సీలకు క్షవరం చేయడం లేదని.. ఫలితంగా క్షవరం కోసం షెడ్యూల్డ్ కులాలు ఆదోని వెళ్తున్నారు.

వివక్ష చూపరాదు..

సమాచారం అందుకున్న జిల్లా పాలనాధికారి రంగంలోకి దిగారు. ఈ మేరకు హేర్ సెలూన్ దుకాణ నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఎవరొచ్చినా కటింగ్ చేయాలే తప్ప కుల వివక్ష చూపరాదని తెలిపారు. ఎవరైనా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేం పద్ధతి..

టీ షాప్​లో ఓ వర్గం వారికి ఒక గ్లాసు, మరో వర్గానికి వేరే గ్లాసులు ఇవ్వడం పట్ల కలెక్టర్ ఫైరయ్యారు. ఆధునిక కాలంలో ఇలాంటి అమానవీయ సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఫకీరప్పను ఆదేశించారు.

ఇవీ చూడండి:

కర్ణాటకలో పర్మిట్ లేని ఆరెంజ్​ బస్సులు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.