ముఖ్యమంత్రి జగన్ ప్రయాణించిన హెలీకాప్టర్ ల్యాండింగ్ విషయంలో కర్నూలు సర్వే శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని సీఎం కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన సంఘటనతో పాటు వరద ప్రాంతాల సందర్శనకు నంద్యాల డివిజన్లో సీఎం పర్యటించినప్పుడూ సర్వేశాఖ సరైన సమాచారం ఇవ్వలేదని తెలిపింది. నంద్యాల పర్యటనలో ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో దిగాల్సి ఉండగా... 5 నిమిషాలు జాప్యం జరిగింది. హెలీకాప్టర్ ల్యాండ్ అవ్వటానికి సంబంధించిన సమాచారాన్ని 15, 4, 326 అంటూ కేవలం డిగ్రీల్లోనే సర్వే శాఖ నివేదిక ఇచ్చిందని సీఎంఓ తెలిపింది. సాధారణంగా ల్యాండింగ్ సంబంధించిన... నివేదికలో డిగ్రీలు, మినిట్స్, సెకన్లతో సహా వివరాలు ఇవ్వాల్సి ఉండగా... కేవలం డిగ్రీల్లోనే ఇవ్వటంపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో నిర్లక్ష్యం వహించిన జిల్లా సర్వేశాఖ అధికారులపై వేటు పడే అవకాశముంది. ఈ విషయంపై డీఆర్వో వెంకటేశంను విచారణ అధికారిగా కలెక్టర్ నియమించారు.
ఇదీ చదవండి: