శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో భక్తులు, సత్రం సిబ్బంది గొడవ పడిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకల పాలెం గ్రామానికి చెందిన నలుగురు భక్తులు మంగళవారం సాయంత్రంలో భోజనం చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వడ్డింపు విషయమై సత్రం సిబ్బందికి, నలుగురు భక్తులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో సూపర్ వైజర్ కందిమల్ల శ్రీనివాసరావు(59) కింద పడిపోయారు. సత్రం సిబ్బంది హుటాహుటిన శ్రీశైల దేవస్థానం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేసినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని దండమూడి గ్రామవాసిగా గుర్తించారు. శ్రీశైలం సీఐ బి.వి. రమణ, ఎస్సై హరి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
ఇదీ చదవండి:
ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!