ETV Bharat / state

విభిన్నంగా ఆలోచించాలి.. అద్భుతాలు సృష్టించాలి: లక్ష్మీనారాయణ - CBI Ex JD Laxminarayana

విద్యార్థులు భిన్నంగా ఆలోచించి అద్భుతాలు సృష్టించవచ్చని మాజీ ఐపీఎస్, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కర్నూలు నగరంలో జరిగిన ఇంపాక్ట్-2019 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
author img

By

Published : Jul 25, 2019, 10:30 PM IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విద్యార్థులు విభిన్నమైన ఆలోచనలతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు రూపొందించవచ్చని జనసేన నేత, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన ఇంపాక్ట్-2019 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యతో పాటు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. చంద్రయాన్-2 ప్రయోగ ముఖ్య లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. చంద్రమండలంలో ఉన్న హీలియంతో ఎలాంటి కాలుష్యం లేకుండా... 10 వేల సంవత్సరాల పాటు విద్యుత్‌ సరఫరా చేయవచ్చని చెప్పారు. సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చేందుకు చంద్రయాన్ - 2 పరిశోధన ఉపయోగపడుతుందని లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి...

రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతారా?: చంద్రబాబు

Intro:* మంగలాoబిక మహారాణిగా పుష్పపల్లకి పై ఊరేగిన కలికిరి ఎల్లమ్మ ....
చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు సోమవారం రాత్రి పుష్ప పల్లకిపై ఊరేగారు. సువాసన భరితమైన ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పల్లకిలో మంగలాoబికా దేవి గా ఆసీనురాలైన ఎల్లమ్మ మంగళ వాయిద్యాలు, చెక్క భజనలు , భక్తుల కోలాహలం మధ్య కలికిరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. దుర్మార్గాన్ని అణచివేసి విజయాన్ని సాధించి పెట్టిన గ్రామ దేవత ఎల్లమ్మ తన అక్క అంకాలమ్మ , తమ్ముడు ఆది పోతరాజు తో కలిసి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పిం చి మొక్కులు తీర్చుకున్నారు.

Body:పుష్ప పల్లకిలో ఊరేగిన ఎల్లమ్మ

Conclusion:చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ దేవత ఎల్లమ్మ అమ్మవారు సోమవారం రాత్రి పుష్ప పల్లకి లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మంగళ అంబికా దేవి గా ఆసీనురాలైన ఎల్లమ్మ చంద్రయుధం చేతబట్టి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.