దేవాలయాల భుములు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని భాజపా నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. దేవస్థానం భూములు వేలం వేయాలన్న బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా కర్నూలులో భాజపా, జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
అయితే.. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు టెంట్ తొలగించారు. వెంకటేశ్వరస్వామి ఆస్తులను అమ్మే నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: