కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని భాజపా, జనసేన పార్టీ నాయకులు ఆందోళ చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దేవాదాయశాఖ భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం మాటపై నిలబడే ప్రభుత్వం కాదని దుయ్యబట్టారు. ప్రజలను, హిందూ మతాన్ని నాశనం చేసే విధంగా వైకాపా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇదీ చదవండి : ఎల్జీ పాలిమర్స్ పిటిషన్... ఇక విచారణ చేయబోమన్న సుప్రీం!