ETV Bharat / state

'యురేనియం తవ్వకాలు అడ్డుకుంటాం'

author img

By

Published : Dec 17, 2019, 4:48 PM IST

Updated : Dec 26, 2019, 3:43 PM IST

కర్నూలు జిల్లాలో... యురేనియం అన్వేషణ, తవ్వకాలు చేపట్టేందుకు కేంద్రానికి సహకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తెదేపా నేత భూమా అఖిలప్రియ తప్పుబట్టారు. ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా.. సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ... యురేనియం అన్వేషణ, తవ్వకాలకు అనుమతి ఇవ్వడం సబబు కాదన్నారు. యురేనియం అన్వేషణకు సహకరించాలని తహసీల్దార్లను కలెక్టర్​ కోరడం సరికాదన్నారు. తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే.. పార్టీలకతీతంగా సమష్టి పోరాటం చేస్తామని అఖిలప్రియ వెల్లడించారు.

Bhuma Akhila priya
భూమా అఖిల ప్రియ

యురేనియం తవ్వకాలకు అనుమతివ్వడం సరికాదన్న అఖిలప్రియ
కర్నూలు జిల్లాలో.. యురేనియం అన్వేషణ, తవ్వకాలకు కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం బాధాకరమని మాజీ మంత్రి, తెదేపా నేత భూమా అఖిలప్రియ అన్నారు. కర్నూలులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆమె.. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ రుద్రవరం, ఆత్మకూరు మండలాల పరిధిలో యురేనియం అన్వేషణకు సహకరించాలని.. తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఉత్తర్వులు ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం తవ్వకాలతో ప్రజలకు జరిగిన నష్టాన్ని చూసి కూడా... కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకానికి అనుమతులు ఇవ్వడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రి తీరు చూస్తే ఆయన సొంత జిల్లాలో జరిగిన నష్టాన్ని కర్నూలు జిల్లాలో కూడా జరగాలని భావిస్తున్నట్లుగా ఉందన్నారు. యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకతీతంగా నేతలు పోరాడాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

''సీఎం జగన్​ పాలనపై పుస్తకం విడుదల''

Intro:ap_knl_101_17_ex_minister_uranium_ab_ap10054 ఆళ్లగడ్డ 8008574916 కర్నూలు జిల్లా లో యురేనియం ఖనిజాల అన్వేషణకు తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం బాధాకరమని మాజీ మంత్రి తెదేపా నేత భూమా అఖిలప్రియ అన్నారు కర్నూలు జిల్లా పరిధిలోని నంద్యాల ఆళ్లగడ్డ రుద్రవరం ఆత్మకూరు మండల పరిధిలో ఖనిజాల అన్వేషణకు సహకరించాలని ఆ మండలాల తహశీల్దార్లకు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఇచ్చిన ఉత్తర్వుల పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా తుమ్మలపల్లి లో యురేనియం తవ్వకాలతో ప్రజలకు జరిగిన నష్టాన్ని చూసి కూడా మన జిల్లాలో అనుమతించడం సబబు కాదన్నారు ముఖ్యమంత్రి తీరు చూస్తే ఆయన సొంత జిల్లాలో జరిగిన నష్టాన్ని కర్నూలు జిల్లాలో కూడా జరగాలని భావిస్తున్నట్లుగా ఉందన్నారు యురేనియం తవ్వకాలు జరిగితే పార్టీలకతీతంగా అందరూ పోరాడాల్సి ఉందన్నారు ప్రజలు కూడా ఇందుకు సహకరించాలని అన్నారు

Body:కర్నూలు లో యురేనియం అన్వేషణకు వ్యతిరేకంగా భూమా అఖిలప్రియ విలేకరుల సమావేశం

Conclusion:యురేనియం ఖనిజం అన్వేషణకు అంగీకరించరు
Last Updated : Dec 26, 2019, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.