కర్నూలు జిల్లా నంద్యాలలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సంజీవనగర్ శాంతినికేతన్ పాఠశాలలో నిర్వహించిన సదస్సులో ప్లాస్టిక్ వాడితే జరిగే నష్టాలను ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో 'నేటి సౌఖ్యం కాదు.. రేపటి ముప్పు చూడు' అంటూ విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ సౌజన్యంతో.. పర్యావరణంపై అవగాహన ర్యాలీ