కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పోలీసులపై దాడి కేసులో మంత్రి బంధువు నారాయణ పరారీలో ఉన్నారు. గుమ్మనూరులో పేకాడుతూ గురువారం పట్టుబడిన 32 మందిని పోలీసులు విచారిస్తున్నారు. ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో.. చిప్పగిరి పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది.
మంత్రి జయరాం బంధువు నారాయణ సహా 35 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ చిప్పగిరి మండలం వైకాపా కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే వైకాపా నాయకులు శ్రీధర్, అజయ్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆ ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇవీ చదవండి..