మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి హత్యకు దారితీసిన ఘటన కర్నూలులో చోటుచేసుంది. శరీన్ నగర్ కు చెందిన గిడ్డయ్య, మహేంద్ర మద్యం తాగేందుకు మూడు రోజుల క్రితం నగర సమీపంలోని టిడ్కో గృహ సముదాయం వద్దకు వెళ్లారు. అక్కడ ఇద్దరు గొడవ పడ్డారు. గిడ్డయ్య కత్తితో మహేంద్రను హత్య చేశాడు. ఇవాళ గిడ్డయ్య పోలీసులకు వద్దకు వెళ్లి తనపై మహేంద్ర కత్తితో దాడి చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. గిడ్డయ్యే మహేంద్రను హత్య చేసినట్లు తెలిసింది. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది.
ఇవీ చదవండి: