ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన సందర్భంగా హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంలో తప్పుడు సమాచారంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఇప్పటికే డీఆర్వో వెంకటేశాన్ని విచారణాధికారిగా కలెక్టర్ వీరపాండ్యన్ నియమించారు. ఈనెల 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి... నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో... వరద ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ల్యాండ్ కావాల్సి ఉండగా... 5 నిమిషాలు జాప్యం జరిగింది. హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి సంబంధించి కేవలం డిగ్రీల్లోనే నివేదికలిచ్చారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ ఘటనపై ఏడుగురు అధికారులకు తాఖీదులు జారీ చేశారు. ఈనెల 30న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: కర్నూలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన