సీఎం జగన్ రేపు కర్నూలుకు రానున్నారు. పర్యటనలో భాగంగా సీఎం పాల్గొననున్న బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు. రేపు ఉదయం సీఎం పదిన్నరకు కర్నూలు రానున్నారు. ఎస్టీబీసీ కళాశాలలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సబ్‌స్టేషన్ భవనాన్ని సీఎం పరిశీలించి... దానికి ఆమోదం తెలిపితే వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తారని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. అనంతరం బహిరంగ సభలో కంటి వెలుగు మూడో విడత కార్యక్రమం, నూతనంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ కార్డులను ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారులకు అందజేస్తారు.
రేపు కర్నూలులో సీఎం జగన్ పర్యటన
ముఖ్యమంత్రి జగన్ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం సభా పర్యటన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి బుగ్గన, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప పరిశీలించారు.