ETV Bharat / state

Love marriage karmakanda: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కుమార్తె.. బతికుండగానే కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు - ప్రేమ వివాహం

Strange incident in Kurnool district: కర్నూలు జిల్లాలో కుమార్తె బతికుండగానే తల్లిదండ్రులు కర్మకాండ జరిపిన ఘటన సంచలనంగా మారింది. తమ కుమార్తె ఫలానా రోజున మరణించిందంటూ ఓ చిత్రపటాన్ని తయారు చేయించి.. ఆ ఫోటోకు పూలమాలలు వేసి, కొబ్బరికాయను కొట్టి బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమ పెళ్లి చేసుకుందని..
ప్రేమ పెళ్లి చేసుకుందని..
author img

By

Published : Jun 16, 2023, 3:57 PM IST

Updated : Jun 16, 2023, 4:36 PM IST

ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. కుమార్తె బతికుండగానే కర్మకాండ జరిపిన తల్లిదండ్రులు

Strange incident in Kurnool district: తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆకలి దప్పుల కోర్చి, కోరికలను అణచుకుని పిల్లల ఆకలిని తీరుస్తుంటారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని బాగా చదివించడానికి రేయింబవళ్లు కష్టపడుతుంటారు. అలాంటి ఓ తల్లిదండ్రులు.. తమ కుమార్తె బతికుండగానే ఫొటోకు దండ వేసి కొబ్బరికాయ కొట్టారు. ఫలానా రోజున చనిపోయిందంటూ తేదీతో సహా ఫొటో కూడా పెట్టేశారు. తమకు ఇష్టం లేకుండా ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే ఈ పరిస్థితికి కారణం కాగా... ఎంతో ప్రేమగా పెంచుకున్న తల్లిదండ్రులే ఇలా చేయడం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన మానవ సంబంధాలను ప్రశ్నిస్తోంది.

ఇష్టం లేని పెళ్లిచేసుకుందని కర్మకాండ.. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హనుమాపురంలో నివాసముంటున్న గొల్ల పెద్ద నాగన్న, ఉరుకుందమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సంతానం. మొదటి కుమార్తె వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. తాజాగా ఆమె బతికి ఉండగానే కర్మకాండ నిర్వహించారు. పెద్ద కుమార్తె ఇందు అదే మండలం వెంకటగిరికి చెందిన ఉరుకుందు అనే యువకుడిని ప్రేమించింది. దీంతో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా అందుకు వారు నిరాకరించారు.

ప్రేమికులకు అధికారుల కౌన్సెలింగ్.. తల్లిదండ్రుల నిరాకరించిన నేపథ్యంలో ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి.. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు.. పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులిద్దరిని పిలిపించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఇందు తల్లిదండ్రుల మాట వినలేదు. ఇద్దరు మేజర్లు కావడం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అధికారులు వారిద్దరినీ స్టేషన్ నుంచి పంపించేశారు.

కుమార్తె చిత్రపటం ముందు ఆహార పదార్థాలు.. ఇందు తన తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో..పెద్ద నాగన్న, ఉరుకుందమ్మ దంపతులు తమ కూతురు 07-06-2023న మరణించిందని.. ఓ చిత్రపటాన్ని తయారు చేయించారు. అనంతరం ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఇష్టమైన ఆహార పదార్థాలు చిత్రపటం ముందుంచారు. కొబ్బరికాయ కొట్టి, కర్మకాండ జరిపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె తమకు తీరని అన్యాయం చేసి వెళ్లిందంటూ బోరున విలపించారు.

వీడియో వైరల్.. కుమార్తె బతికుండగానే కర్మకాండ చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో.. 'తమ కుమార్తె ఫలానా రోజున మరణించిదంటూ ఓ చిత్రపటాన్ని తయారు చేయించి.. ఆ ఫోటోకు పూలమాలలు వేసి, ఇష్టమైన ఆహార పదార్థాలను ఆ చిత్రపటం ముందుంచి.. అనంతరం కొబ్బరికాయను కొట్టి కర్మకాండ జరిపి.. బోరున విలపించటం వీక్షకులను విస్మయానికి గురి చేసింది. వీడియోను చూసిన వారు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు'

Last Updated : Jun 16, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.