కర్నూలు జిల్లా నంద్యాల బొమ్మలసత్రం వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. తల, మొండెం వేర్వేరుగా రైలు పట్టాలపై పడి ఉండడంతో గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 50ఏళ్లకు పైబడిన మృతుడు.. టీ షర్ట్, షార్ట్ ధరించి ఉన్నాడు. నంద్యాల రైల్వేస్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై..పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.
ఇవీ చదవండి