కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు.. అదృశ్యం కావడం ఆ కుటుంబీకుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన దంపతులు నరసింహులు, నీలిమ.. ఈనెల 21న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్వాతి వేడుకలకు వెళ్లారు. వెళ్లిన వాళ్లు మూడు రోజులైనా తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబీకులు ఆందోళనకు గురైయ్యారు.
ఈ క్రమంలో నరసింహులు తండ్రి గంగన్న.. ఆళ్లగడ్డ గ్రామీణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అహోబిలం పరిధిలోని కారంజ నరసింహస్వామి ఆలయం వద్ద వారీ బైకును గుర్తించారు. దంపతుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నామని ఎస్సై నర్సింహులు చెబుతున్నారు. దంపతులు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయారా.. లేక కుటుంబ సమస్యలతో ఏమైనా చేసుకున్నారా..? అన్న ఆందోళన బంధువుల్లో నెలకొంది.
Polavaram: పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లపై చర్చించేందుకు నిపుణుల కమిటీ