కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థలంలో.. వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికులు ఆందోళన చేపట్టారు.
పట్టణంలో ర్యాలీగా చేపడుతున్న వ్యవసాయ కార్మికులను.. టెక్కే వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవటంతో.. ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించగా.. స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎమ్మెల్యే స్పందించాలని వారు డిమాండ్ చేయగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో చరవాణి ద్వారా నాయకులతో మాట్లాడారు. భూములు ఎక్కడ ఉన్నాయో మీరే చూపాలంటూ ఎమ్మెల్యే కార్మికులకు సూచించగా.. ఓ సారి సమావేశమై చర్చిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: