వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కర్నూలు సుందరయ్య సర్కిల్లో వ్యవసాయ, కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్ర వైఖరికి నిరసనగా ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. కేంద్రం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా: శైలజానాథ్