Sub Registrar Office Kalluru: అవినీతి ఆరోపణలతో కర్నూలు జిల్లా కల్లూరు సబ్ రిజిస్ట్రార్ అరుణ్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27, 28 తేదీలలో ఏసీబీ అధికారులు కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారిక నగదు రూ.59వేల రూపాయలు గుర్తించి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సబ్ రిజిస్ట్రార్ అరుణ్ కుమార్ లంచం తీసుకున్నట్లు తేలడంతో సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
ఇవీ చదవండి: