నాలుగేళ్ల చిన్నారిపై 22 ఏళ్ల రుద్రేశ్ అనే యువకుడు అత్యాచారం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కాలనీలోని ఓ దేవాలయం వద్ద చిన్నారి ఆడుకుంటుండగా... తనని పక్కకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, సీఐ సురేష్ కుమార్ రెడ్డి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. చిన్నారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి :