పూర్వీకుల జ్ఞాపకాన్ని ఇలా పదిలం చేసుకున్నాడు..! - కర్నూలులో చెట్టును బతికించిన మనిషి
చెట్లు... స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయి. మనిషి బతకడానికి కావాల్సిన గాలిని ఇస్తాయి. తమ అవసరాల కోసం ఇష్టమొచ్చినట్లు చెట్లను తెగ నరుకుతున్న ఈరోజుల్లో... ఏళ్ల నాటి చెట్టును కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నాడో మంచి మనసున్న వ్యక్తి. కర్నూలుకు చెందిన రఘనాథ్కు ఐదెకరాల పొలం ఉంది. దాని ముందు భాగంలో దాదాపు 60ఏళ్ల నాటి భారీ వృక్షం ఉంది. రహదారి విస్తరణలో ఆ చెట్టును తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ పూర్వీకులు నాటిన ఆ మహావృక్షాన్ని ఎలాగైనా బతికించుకోవాలనుకున్నాడు రఘునాథ్. 15 రోజుల శ్రమ, 2 లక్షల ఖర్చు, 6 క్రేన్ల సహాయంతో చెట్టును సురక్షితంగా చెట్టును తొలగించి.. వేరే ప్రదేశంలో నాటాడు. రఘునాథ్ చేసిన ఈ మంచి పనిని స్థానికులు అభినందిస్తున్నారు.