నీటి ఉద్ధృతికి కళ్లివంక వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కళ్లివంక వాగు పొంగింది. దీనిని గుర్తించని కర్ణాటకకు చెందిన ఓ ఫోర్డు వాహనం గుంతకల్లు నుంచి ఆలూరు వెళ్తూ అర్ధరాత్రి ప్రాంతంలో వాగులోకి దిగి కొట్టుకుపోయింది.
కొట్టుకుపోయిన కారులో ఉన్న వ్యక్తికి సురక్షితంగా బయటపడ్డాడు. అతడు గుల్బర్గా జిల్లా నాల్వర్కు చెందిన జాహిద్ అన్సార్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కారుకు ఓపెన్ టాప్ ఉండటంతో డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చినట్లు బాధితుడు తెలిపారు. ఈయన వైద్యుడిగా పని చేస్తున్నట్లు చెప్పారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, నాయకులు జహీర్, అమీర్ మరికొందరు వాహనదారులు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కారును గుర్తించి తాళ్లతో బయటకు తీశారు.
ఇవీ చదవండి: