కర్నూలులో 104 కాంట్రాక్టు ఎంప్లాయీస్ యునియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 104 లో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్టులను, ల్యాబ్ టెక్నిషియన్లను వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు.
104 లో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లకు ముఖ్యమంత్రి హమీ నేరవేర్చారని.. తమకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన చెందారు. కరోనా కాలంలోనూ విధులు నిర్వహిస్తున్న తమకు రెండు నెలలుగా జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు తీర్చాలని.. సమస్యలు పరిష్కరించాలని.. హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: