తెదేపా నేత అచ్చెన్నాయుడిని అర్థరాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు జరిగిన యత్నంపై... తెదేపా చేసిన చేసిన వ్యాఖ్యల విషయంలో వైకాపా స్పందించింది. అచ్చెన్నన్ను హత్య చేయడానికి ప్రభుత్వం చూస్తోందని తప్పుడు ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే జోగి రమేష్ విజయవాడలో అన్నారు. అచ్చెన్నాయుడు అనారోగ్యంతో ఉన్నారని తెలిసి మంచి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని తెలియజేశారు.
ఆయన త్వరగా కోలుకోవాలని తాము కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు నిజాలు చెబితే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ప్రజావేదిక వద్ద ఆందోళనకు తెదేపా నేతలు వెళ్లడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మించినందునే కూల్చివేశారని స్పష్టం చేశారు. ఈ విషయంపై తెదేపా నేతలు రాద్దాంతం చేయడం తగదన్నారు. తెదేపాకు చేతనైతే నవరత్నాల హామీలు అమలు చేయలేదని నిరసన చేపట్టాలంటూ.. సవాల్ విసిరారు.
ఇదీ చూడండి:
జీజీహెచ్లో.. అచ్చెన్నను ప్రశ్నిస్తున్న అనిశా అధికారుల బృందం