ETV Bharat / state

విశాఖ రాజధాని.. ఉగాది ముహూర్తం.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే... - సీఎం జగన్

ap capital : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఖాయమని, పాలన సాగించడానికి అవసరమైన అన్ని వసతులు అక్కడ ఉన్నాయని వైఎస్సార్​సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని వారు తెలిపారు.

విశాఖ రాజధాని
విశాఖ రాజధాని
author img

By

Published : Feb 2, 2023, 7:36 AM IST

Updated : Feb 2, 2023, 9:43 AM IST

విశాఖ రాజధాని

ap capital : రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా ఉండదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే.. అక్కడే ఆఫీస్ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రితో పాటు రాజధాని కూడా విశాఖకు మారుతుంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీఎం ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

ఉగాది నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగనుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ కరణం ధర్మశ్రీ తెలిపారు. అదేరోజు విశాఖ రాజధానిగా సీఎం ప్రకటించనున్నారని ఆయన తెలిపారు. విశాఖ నుంచి పాలన సాగించడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. రాజధానిని విశాఖకు తరలించడం ఖాయమని...అదే విషయం సీఎం జగన్ మరోసారి చెప్పారని వైఎస్సార్​సీరీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని తెలిపారు. సుప్రీంతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని..ఒకవేళ రాకున్నా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్‌లో మూడురాజధానుల బిల్లు పెట్టిస్తామని కొడాలినాని వివరించారు. మూడు రాజధానుల ఏర్పాటే ప్రభుత్వ సంకల్పమని పేర్నినాని అన్నారు.

రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా ఉండదు. ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడుంటారో అక్కడే ఆఫీస్. ముఖ్యమంత్రి ఎక్కడుంటే.. అక్కడే ఆఫీస్. ముఖ్యమంత్రి ఎక్కడ నిర్ణయం తీసుకుంటే అదే ఆఫీస్. - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక మంత్రి

కొత్త బిల్లు తీసుకుని వస్తాం. ముఖ్యమంత్రి అనే వారు.. ఈ రాష్ట్రానికి రాజులాంటి వాడు. ఆయన పరిపాలన ఎక్కడి నుంచి చేస్తే అదే రాజధాని. ముఖ్యమంత్రితో పాటు రాజధాని కూడా వస్తుంది. - గుడివాడ అమర్నాథ్, మంత్రి, ఆంధ్రప్రదేశ్

సీఎం ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని. ఆయన ఎక్కడుండి పరిపాలిస్తే అదే రాజధాని. - తమ్మినేని సీతారాం, స్పీకర్, ఆంధ్రప్రదేశ్

వచ్చే ఉగాది నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుంది అని ప్రభుత్వ చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ... జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారు. రాష్ట్రానికి అధికారం లేదని సుప్రీం కోర్టు చెప్పింది కాబట్టి... కేంద్రంపైన ఒత్తిడి తీసుకొస్తాం అని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. సమపాళ్లలో అభివృద్ధి జరగాలి.. అందరూ ఈ రాష్ట్రం మాది అని అనుకోవాలి అని ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 2, 2023, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.