కృష్ణా జిల్లా తిరువూరులో నిర్వహించిన వైఎస్సార్ రైతుభరోసా విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఎద్దుల బండిపై ప్రయాణిస్తోన్న రక్షణ నిధికి తృటిలో ప్రమాదం తప్పింది. బ్యాండు మేళాలతో ఎద్దుల బండిపై చేరుకుని వెళ్తోన్న ఎమ్మెల్యే,సభా వేదికకు చేరుకునే సమయానికి ఎద్దులు బెదిరిపోయి, పరుగు తీశాయి. దీంతో బిత్తరపోయిన కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. అందరు కలసి ఎమ్మెల్యే రక్షణనిధిని సురక్షితంగా బండి పై నుంచి కిందకు దించేశారు. ఎద్దులను మల్లెల సహకార సంఘం అధ్యక్షుడు కలకొండ రవికుమార్ కట్టడి చేయడంతో ప్రమాదం తప్పింది.అక్కడి నుంచి ఎమ్మెల్యే పాదయాత్రగా సభా వేదికకు చేరుకున్నారు.
ఇవీ చూడండి-కొండవీడుకోట అందాలు చూద్దం రారండీ!