ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కానీ.. అధికారమే పరమావధి అనే వైకాపా తత్వం తీవ్రరూపం దాల్చిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం వ్యక్తుల ఇష్టాయిష్టాల పై ఆధారపడి నడవదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. వ్యవస్థలను, వాటి ప్రతిష్టను దిగజార్చినా.. నిర్వీర్యం చేసినా ..ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యం శిథిలావస్థకు చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల్లో ఎగువ సభ తప్పనిసరని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: చిన్న పరిశ్రమలకు అండగా ఉంటాం'.. రూ.512 కోట్లు విడుదల