రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం అనేక ప్రశ్నలను ఉత్పన్నం చేస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆందోళనలకు వ్యతిరేకంగా బిల్లులను రూపొందించారని ఆయన మండిపడ్డారు. న్యాయ సమీక్ష కోసం బిల్లులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయని... తీర్పు వచ్చేదాకా రాష్ట్ర ప్రభుత్వం వేచి ఉండాలన్నారు. అటార్నీ జనరల్ అభిప్రాయం కోసం గవర్నర్ ఈ బిల్లులను ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో మళ్లీ ఈ బిల్లులను పెట్టాలని... సలహా ఇచ్చిన రాష్ట్ర న్యాయశాఖకే గవర్నర్ ఈ బిల్లులను పంపి న్యాయ సలహా కోరడంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ 2 బిల్లుల గురించి ప్రజల్లో ఉన్న ఆందోళనలపై గవర్నర్ విచారణ చేయాల్సి వుందన్నారు.
సెలెక్ట్ కమిటీ అంశం ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. రెండు బిల్లులు న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పినా ఎందుకు విస్మరించారన్నారు. కేంద్రం చేసిన చట్టానికి విరుద్దంగా, రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు ఉన్నాయన్నారు. ఇవి భారత రాజ్యాంగం ఆర్టికల్ 251 కిందకు వస్తాయని పేర్కొన్నారు. వీటిపై అంతిమ అధికారం న్యాయ సమీక్షదేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఈ 2నబిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం ద్వారా శాసన మండలిని ఒక పరిపాలనా అంగంగా గమనంలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి