'మాతృభాషను కాపాడుకుందాం - స్వాభిమానం చాటుకుందాం' అనే నినాదంతో ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు మొదలయ్యాయి. ఈ సభలకు ప్రముఖ రచయితలు, కవులు హాజరయ్యారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడిన భాషా పండితులు... ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ... మాతృభాషకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదని మండలి బుద్ధప్రసాద్ నిలదీశారు.
మౌనంగా ఉంటే లాభం లేదు...
అసలు ఆంగ్లమాధ్యమం గురించి ఎక్కడ అధ్యయనం చేశారని పాఠశాలల్లో ప్రవేశపెడతారంటూ ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రశ్నించారు. మౌనంగా ఉంటే లాభం లేదని... ప్రభుత్వాలను మార్చే శక్తి మన చేతుల్లోనే ఉందని ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు.
ప్రపంచ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన చమత్కార చతుర్ముఖ పారాయణం, అష్టావధానం, ప్రత్యేక కవిసమ్మేళనం వంటి భాషా కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వరకూ ఈ సభలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: