వెల్లటూరులోని ఉద్యాన నర్సరీలో కొబ్బరి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. కొబ్బరి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే కొబ్బరిలో కేరళ, తమిళనాడు కర్నాటక మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పంట అభివృద్ధితోపాటు పారిశ్రామికంగానూ పురోభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు తెలిపారు. వర్జీన్ ఆయిల్ తయారీ, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, ఎండు కొబ్బరి తయారీ పరిశ్రమల దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు.
కొబ్బరి చెట్టులో కాండం నుంచి ఆకుల వరకు అన్ని పనికొచ్చేవేనని.. ఒకసారి నాటితే రకం మేరకు 50 నుంచి 70 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తుందని... కొబ్బరితో 170 రకాల ఉత్పత్తులకు వీలుందని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ సహాయ సంచాలకులు బి.దయాకర్‌బాబు, అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు