![రాజ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10919375_548_10919375_1615196956766.png)
అవకాశాలు లభిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా పోటీపడతారని గవర్నర్ సతీమణి, రాష్ట్ర ప్రథమ పౌరురాలు సుప్రవ హరిచందన్ అన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన రాజ్‌భవన్ మహిళా ఉద్యోగులకు సుప్రవ హరిచందన్ బహుమతులు అందజేశారు. కేక్ కట్ చేసి ఉద్యోగులకు స్వయంగా అందించారు. ఈ సంతోషకరమైన క్షణాలను అందరితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్‌భవన్ సంయుక్త కార్యదర్శి నాగమణి అధ్యక్షత వహించారు.
![రాజ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10919375_382_10919375_1615196209715.png)
రాష్ట్ర ప్రథమ పౌరురాలిని రాజ్‌భవన్ మహిళా ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. దేశ అభివృద్ధిలో మహిళలకు సమాన పాత్ర ఉందని ప్రపంచానికి తెలియజేసే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం భావించవచ్చన్నారు. దశాబ్ధాల ఉద్యమాల ఫలితంగా సాధించిన హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.
![రాజ్ భవన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10919375_464_10919375_1615196616596.png)
ఇవీ చదవండి