ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా మహిళా దినోత్సవం - womens day celebrations in vizainagaram district

రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. పలుచోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించగా మరి కొన్నిచోట్ల ఉద్యోగినులకు ఆటల పోటీలు నిర్వహించారు.

విజయనగరంలో నిర్వహించిన మహిళ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

author img

By

Published : Mar 8, 2021, 4:29 PM IST

Updated : Mar 8, 2021, 6:16 PM IST

కృష్ణాజిల్లాలో..

మహిళా ప్రగతితోనే దేశాభివృద్ధి సాధించగలమని రాష్ట్ర న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎం. సుబ్బారావు తెలిపారు. కృష్ణాజిల్లా మైలవరంలోని హానిమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో తమ కృషిని చూపుతూ దేశ ప్రగతికి కారణం అవుతున్నారన్నారు. మహిళలు లేని కుటుంబాన్ని ఉహించలేమని, ఈ మహిళా దినోత్సవం ద్వారా వారికి కృతజ్ఞతలు తెలపడం మనందరి బాధ్యత అని తెలిపారు.

మొవ్వలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు డిబేటింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి సన్మానించారు.

గుంటూరు జిల్లాలో....

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు గ్రామీణ పోలీసులు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఎస్పీ విశాల్ గున్నీ ప్రారంభించారు. మహిళా ప్రతి రంగంలోనూ తన సత్తా చాటుతూ.. సమాజ ప్రగతికి, కుటుంబ సంక్షేమానికి, సమాన బాధ్యతను నిర్వర్తిస్తోందని ఎస్పీ విశాల్ గున్నీ అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తరచూ అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుస్తాయని సూచించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మహిళాభ్యున్నతికి అత్యంత ప్రాదాన్యత ఇస్తున్నారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. వైకాపా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ మహిళా చైర్‌పర్సన్‌లు, డైరెక్టర్లను ధర్మాన కృష్ణదాస్‌ సత్కరించారు.

చిత్తూరు జిల్లాలో...

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఆరేపల్లి, రంగంపేట, రామిరెడ్డిపల్లి, నరసింగాపురం పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు. రామిరెడ్డిపల్లి సర్పంచి కోటాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథిగా ఎంపీడీవో రాధమ్మ, ఎంఈవో లలితకుమారి హాజరయ్యారు. పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ సిబ్బందిని సన్మానించారు. మహిళలకు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ ఆటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

నెల్లూరు జిల్లాలో...

పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెప్మా మహిళలు కేక్ కత్తిరించి సంబరాలు చేసుకున్నారు.

విజయనగరం జిల్లాలో...
స్త్రీలు విద్యావంతులైతే, స‌మాజం పురోభివృద్ది చెందుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ స్ప‌ష్టం చేశారు. ఆడ‌పిల్ల‌ల‌ను కూడా బాగా చ‌దివించాల‌ని ఆయ‌న కోరారు. జిల్లా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ‌శాఖ ఆధ్వ‌ర్యంలో విజయనగరం స్థానిక ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ కార్య‌క్ర‌మానికి క‌లెక్ట‌ర్‌ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.... మ‌హిళ‌లు విద్యావంతులైతే, కుటుంబం తో పాటు, ఆ గ్రామం, త‌ద్వారా స‌మాజం కూడా అభివృద్ది చెందుతుంద‌నడానికి త‌న జీవిత‌మే ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లాలో....

ప్రకాశం జిల్లా, కొమరోలు పోలీస్ స్టేషన్​ ఆవరణలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ సాంబ శివయ్య, ఏఎస్ఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళా పోలీసులు, గ్రామ సచివాలయ పోలీసుల తో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల ప్రాధాన్యత, ప్రస్తుతం మహిళా సాధిస్తున్న ఘనత వారికి వివరించారు. అనంతరం మహిళా పోలీసులకు బహుమతులను అందజేశారు.

కంభం మండలంలోని ,హాజరత్ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు పి.లీలావతి అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో పలువురు మహిళా ఉపాధ్యాయులు స్త్రీల శక్తి సామర్ధ్యాలపై వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ స్త్రీలను ప్రకృతి సారూప్యంగా అభివర్ణించారు.

విశాఖ జిల్లా...

మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే వారి కుటుంబాల సాంఘిక స్థాయి మెరుగుపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ దుర్గాబాయి దేశ్​ముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'కోవిడ్-19 సందర్భంలో మహిళా నాయకత్వం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. చిన్న తరహా వాణిజ్య ప్రాజెక్టుల్లో మహిళలు కీలక పాత్ర వహిస్తున్నారని ఆచార్య కృష్ణమోహన్ అన్నారు. చిన్న తరహా వాణిజ్య సంస్థల నిర్వహణలో బంగ్లాదేశ్ మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని వారు సాధించిన విజయాలను ఇతర దేశాలు అనుసరిస్తున్నాయని వివరించారు.

ఇదీ చదవండి:మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్

Last Updated : Mar 8, 2021, 6:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.