ETV Bharat / state

ఏళ్లుగా పెండింగ్​లోనే జీతం, పీఎఫ్.. ఆ వృద్ధురాలి చివరి కోరిక ఇప్పటికైనా నెరవేరేనా? - krishna district latest updates

ఆమె ఉద్యోగ విరమణ పొందిన మహిళ.. ఎన్నో ఏళ్లుగా స్వీపర్ గా, వాచ్​మన్ గా సేవలందించింది. కానీ.. కనికరం లేని అధికారులు ఆమెకు రావాల్సిన జీతాన్ని పెండింగ్​లో పెట్టారు. 11 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన ఆమె.. తన జీతం, భవిష్యనిధి డబ్బుల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. అయినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు అనారోగ్యం బారినపడింది. సహాయం కోసం ఎదురుచూస్తోంది. కుమార్తె దగ్గర ఆశ్రయం పొందుతోంది. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేస్తారేమో అని ఎదురు చూస్తోంది.

ఆమె చివరి కోరికదే
ఆమె చివరి కోరికదే
author img

By

Published : Aug 28, 2021, 5:57 PM IST

వృద్దురాలు పనిచేసిన పంచాయతీ

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన బుర్రే రాఘవమ్మ పురిటిగడ్డ, చల్లపల్లి గ్రామ పంచాయతీల్లో స్వీపర్, వాచ్ఉమన్ గా పనిచేసి.. పదకొండు సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. అప్పటికే తనకు పురిటిగడ్డ గ్రామ పంచాయతీలో రూ.53,050 జీతం రావల్సి ఉండగా అది పెండింగ్ లోనే ఉంచారు. అలాగే పెన్షన్ కంట్రిబ్యూషన్ రూ.78,171 తో పాటు ప్రావిడెంట్ ఫండ్ కోసం తిరిగీ తిరిగీ ఆమె అలిసిపోయారు.

స్పందన, ప్రజావాణి కార్యక్రమాల్లో అనేక సార్లు తన గోడు వినిపించారు. అంతేగాక.. జిల్లా అధికారుల వద్ధ అనేక సార్లు మొర పెట్టుకున్నారు. వృద్ధాప్యం మీద పడుతున్నా కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారు. చివరికి.. లోక్ అదాలత్ కు వెళ్లినా.. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలను గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోలేదు. మరో సందర్భంలో... జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు జారీ చేసినా మోక్షం లభించలేదు.

ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన బుర్రే రాఘవమ్మ కనీసం మాట్లాడలేని స్థితిలో ఉంది. పురిటిగడ్డలో తన పెద్ద కుమార్తె చావలి నళిని సంరక్షణలో ఉన్న ఆమె దీన స్థితిని.. మేనల్లుడు శీలం భాస్కరరావు మీడియాకు తెలిపారు. రాఘవమ్మ చనిపోయేలోపైనా అధికారులు ఆమెకు రావాల్సిన జీతం, పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదు: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.