ETV Bharat / state

కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య.. మరోచోట ప్రియుడి గోంతు కోసిన ప్రియురాలు

Wife Killed Her Husband Along With Son: భర్తను భార్య, చిన్న కుమారుడు కలిసి హతమార్చాన సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. కుటుంబకలహాలతో ఇతన్ని భార్య చిన్న కుమారుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోచోట మద్యం మత్తులో ఉన్న ప్రియుడ్ని ప్రియురాలు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చోటు చేసుకుంది.

Wife Killed Her Husband
Wife Killed Her Husband
author img

By

Published : Mar 31, 2023, 11:34 AM IST

Updated : Mar 31, 2023, 12:28 PM IST

Wife Killed Her Husband Along With Son: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు మండలం కానూరు పరిధిలో జరిగిన వ్యక్తి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. మృతుడు సురేశ్​ని అతని భార్య, చిన్న కుమారుడు ఇద్దరు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు సురేశ్​ని భార్య, చిన్న కుమారుడు కలిసి కుటుంబ కలహాల నేపథ్యంలోనే హతమార్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టైం హాస్పిటల్స్ సమీపంలో నివసిస్తున్న సాలిగ్రామ్ సురేష్ ఆటో నగర్​లో పని చేస్తుంటాడు. ఇతనికి వివాహం జరిగి 24 సంవత్సరాలు అయింది. ఇతనికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు ఐదేళ్ల కిందట ట్రాన్స్​జెండర్​గా మారాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వివాదం నెలకొంది. అప్పటినుంచి ట్రాన్స్​జెండర్​గా మారిన కుమారుడు తన పేరును రోజాగా మార్చుకుని తెలంగాణలోని కాగజ్​నగర్​లో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన అతనికి.. తండ్రికి మధ్య మళ్లీ వివాదం నెలకొంది. గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు కాగజ్​నగర్​కి వెళ్లిపోయాడు.. ఇదే క్రమంలో పెద్ద కుమారుడికి తల్లి, చిన్న కొడుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే సురేశ్​.. భార్య అరుణ, చిన్న కుమారుడు ఆకాష్​ మధ్య వాగ్వాదం జరిగింది.. ఈ వివాదం ఘర్షణకు దారి తీయగా.. ఈ ఘర్షణలో కుటుంబ పెద్ద సురేశ్​ మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి వివరాలు సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు.. వారిరువురూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు ఇద్దరి మధ్య ఏం మనస్పర్ధలు వచ్చాయో తెలియదు గానీ.. మద్యం మత్తులో ఉన్న ప్రియుడ్ని ప్రియురాలు కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణం కఠేవరం కాలవ కట్టు మీద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాల ప్రకారం.. కఠేవరం ప్రాంతానికి చెందిన గద్దె రాము తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించేవాడు. అదే గ్రామానికి చెందిన ఆమని అనే మహిళతో మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి వారి మధ్య ఏం జరిగిందో తెలియదు.. మద్యం మత్తులో ఉన్న రాముని గొంతు కోసి హతమార్చింది. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోశారని పోలీసులను పక్కదారి పెట్టే ప్రయత్నం చేయగా.. ఆమెను పోలీసులు వారి స్టైల్​లో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

కొడుకుతో కలిసి భర్తను చంపిన భార్య.. మరోచోట ప్రియుడి గోంతు కోసిన ప్రియురాలు

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.