సాధారణంగా చేపలు నలుపు, తెలుపు మేళవించిన వర్ణంలో కనిపిస్తుంటాయి. కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లికి చెందిన బత్తిన శివనాగరాజు తన రెండెకరాల చెరువులో కట్ల రకం చేపను సాగు చేశారు.
వాటిలో ఒక చేప పూర్తిగా తెల్లరంగులో ఉండి ఆకట్టుకుంది. ముత్యంలా మెరిసింది. అయితే.. ఇది జన్యుపరమైన లోపంతో వచ్చిన అల్బినో అనే వ్యాధి కారణంగానే తెల్లగా కనిపిస్తోందని కైకలూరు మత్స్యశాఖ ఏడీ వర్దన్ తెలిపారు. సూర్యకాంతిని సైతం ఆ చేప తట్టుకోలేదని చెప్పారు.
ఇదీ చూడండి: