ETV Bharat / state

రేపు ఎస్సీ ఎస్టీలతో కలిసి శ్రీవారిని దర్శిస్తాం : స్వాత్మానందేంద్ర

author img

By

Published : Mar 30, 2021, 11:58 AM IST

హిందూ ధర్మం ఒక మతానికి చెందినది కాదని, అది భారతీయ జీవన విధానమని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలదని, ధర్మాన్ని అనుసరిస్తేనే దైవానుగ్రహం లభిస్తుందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రేపు ఎస్సీ ఎస్టీలతో కలిసి శ్రీవారిని దర్శిస్తాం : స్వాత్మానందేంద్ర
రేపు ఎస్సీ ఎస్టీలతో కలిసి శ్రీవారిని దర్శిస్తాం : స్వాత్మానందేంద్ర

విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ముగియనున్నందున.. ఎస్సీలు, గిరిజనులతో కలిసి తిరుమలేశుడి దర్శనానికి ఉత్తర పీఠాధిపతులు పయనమయ్యారు. విజయవాడలోని యాత్రీకులతో కలిసి ఆయన సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

హిందూ అంటే మతం కాదు..

హిందూ ధర్మం అంటే భారతీయ జీవన విధానానికి సంకేతమని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలదని, ధర్మాన్ని అనుసరిస్తేనే భగవత్​ సాక్షాత్కారం అందుతుందన్నారు.

బుధవారం ఎస్సీ, ఎస్టీలతో శ్రీవారి దర్శనం..

సీవీరెడ్డి ఛారిటీస్​లో బస చేసిన యాత్రీకులతో ప్రత్యేకంగా సమావేశమై వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. బుధవారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వరస్వామిని ఎస్సీలు, గిరిజనులతో కలిసి దర్శిస్తామని వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం యాత్రీకులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న ఉత్సాహం వారి కళ్లల్లో కనబడుతోందని వివరించారు.

ఇవీ చూడండి : కొలువులందించేలా డిగ్రీలో ‘జీవన్‌ కౌశల్‌’ పాఠ్యప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.