కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరు డ్యాం నుంచి ఆయకట్టుకు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సాగునీటిని విడుదల చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే మున్నేరు డ్యాం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పల్లె బాట కార్యక్రమంలో భాగంగా 2004లో మున్నేరు డ్యాం పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఆయన మృతి తర్వాత డ్యాం పురోగతిని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. డ్యాంలో మిగిలి ఉన్న పెండింగ్ పనుల గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనప్పచి నుంచి రాష్ట్రంలో సాగునీటికి కొరత లేకుండా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా