ETV Bharat / state

'జెన్​కో ఏకపక్ష నిర్ణయంతో.. అలవెన్సుల నిలిపివేత'

కృష్ణా జిల్లా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు నిరసనకు దిగారు. జెన్​కో యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, అలవెన్సులు నిలిపివేశారని ఆందోళన చేశారు.

employees agitation
ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Sep 29, 2020, 3:34 PM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు.. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 2003వ సంవత్సరం నుంచి అందిస్తున్న ఫర్మామెన్స్ లింక్డ్ జనరల్ అలవెన్స్​ను అర్థాంతరంగా జెన్​కో యాజమాన్యం నిలుపుదల చేయటంతో.. ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యూనియన్​ అసోసియేషన్ సభ్యులను సంప్రదించకుండా.. జెన్​కో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అలవెన్సులు నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వలన ఉద్యోగులంతా నష్టపోవాల్సి వస్తోందని జేఏసీ అధ్యక్షుడు మోటుపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ హక్కులు కాపాడుకోవటానికి జేఏసీ నిర్వహించే పోరాటాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. ఉద్యోగులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. డిస్కంను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ.. దీన్ని అందరూ ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.