కృష్ణాజిల్లా తిరువూరు మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామ వాలంటీర్ సోదరుడు నాటుసారా విక్రయిస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గ్రామంలోని పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం భవనం వెనుక నాటుసారా విక్రయిస్తుండగా మరో వాలంటీర్ వీడియో తీశారు. ఇది కాస్తా వాట్సప్‌లో వైరల్ అయింది. సమాచారం అందుకుని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేలోగా సదరు వ్యక్తి పారిపోయాడు. అతని ఇంటి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.