ETV Bharat / state

తితిదే సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన బాలుడి వేలు

తితిదే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విజయవాడకు చెందిన బాలుడు కృష్ణదీప్ కుడిచేతి ఉంగరపు వేలు తెగిపోయింది.  సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 27, 2019, 6:52 PM IST

తితిదే సిబ్బంది నిర్లక్ష్యంపై... భక్తుల ఆవేదన
తితిదే సిబ్బంది నిర్లక్ష్యంపై... భక్తుల ఆవేదన

తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల భద్రత పట్ల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని... విజయవాడకు చెందిన రమేష్ దంపతులు ఆరోపించారు. కొండపైన ఉండే ఉప ఆలయాల్లో ఒకటైన వరాహ నరసింహస్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్లందరినీ సిబ్బంది ముందుకు రమ్మనగా.. దంపతులు వెళ్లారు. అనంతరం లోపలికి అనుమతించారు. తాము లోపలకి వెళ్లడానికి ప్రయత్నించగా... సిబ్బంది చూసుకోకుండా ఒక్కసారిగా గేటు మూసివేశారని రమేష్ తెలిపారు. తమ కుమారుడు కృష్ణదీప్ కుడిచేతి ఉంగరపు వేలు తెగిపోయిందని వాపోయారు. ఈ ఘటనపై తితిదే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చిన్నారిని హుటాహుటిన దేవస్థానానికి సంబంధించిన ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడా... సిబ్బంది స్పందించని కారణంగా... ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. భక్తుల పట్ల కనికరం లేకుండా సిబ్బంది వ్యవహరిస్తే చర్యలు చేపట్టరా... అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: అంతా కల్తీ మయం.. జాగ్రత్త వహిచండి!

Intro:

Body:Ap-tpt-77-20-Adhanu dhatina padhanu vanaledhu-Avb-Ap10102

గడచిన 15 ఏళ్లుగా చిత్తూరు జిల్లా లోని పడమటి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు వీడలేదు .అనంతపురం జిల్లా సరిహద్దులోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో కరువు ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ ఏడాది జూలై చివరి వారానికి చేరుకున్నా, వర్షాల జాడ లేదు. కొన్ని ప్రాంతాల్లో కురిసిన అరకొర వర్షాలకు విత్తిన వేరుశనగ వర్షం లేక వాడు ముఖం పట్టింది. ప్రతి ఏడాది జూలై ఆఖరు వారానికి నీళ్ళతో కలకలలాడే సాగునీటి వనరులు, వాగులు వంకలు మొత్తం ఎండిపోయాయి. మదనపల్లి తంబాలపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలో 1500కు పైగా చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. గడచిన పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో వర్షాధార ఖరీఫ్ మెట్ట సేద్యం రైతాంగం సందిగ్ధంలో పడింది. మదనపల్లి, తంబళ్లపల్లె నియోజకవర్గాల వ్యవసాయ డివిజన్ పరిధిలో ఖరీఫ్ మెట్ట సేద్యం వేరుశనగ, చిరుధాన్యాలు, ఇతర అంతర పంటల సాధారణ సాగు విస్తీర్ణం 39 వేల హెక్టార్లు కాగా జూలై ఆఖరి వారానికి అరకొర వర్షాలకు విత్తనాలు వేసింది 4700 హెక్టార్లు మాత్రమే. వర్షాధార మెట్ట పొలాలు దుక్కులు చేసి కొందరు, వర్షాలు పడక దుక్కులు కూడా చేయని మరికొందరు రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. అరకొర వర్షాలకు విత్తనాలు వేసిన రైతుల పొలాల్లో మొలకలు గూడా సక్రమంగా పూర్తిస్థాయిలో రావడం లేదు. మొలకలు పైకి వచ్చినప్పటి నుంచి వానలు లేక వాడు ముఖం పట్టాయి.
ఖరీఫ్ అదను జూలై 15 కాగా జూలై ఆఖరి వారమైన వర్షాల జాడ లేదు అదును దాటి పోతున్నా పదును వర్షం కూడా లేక ఇక ఏం చేయాలో నని రైతాంగం ఆలోచనలో పడింది. కొందరు రైతు కుటుంబాలలో వలస బాట పట్టారు. ఇప్పటికే పడమటి మండలాల్లో వలసలు ప్రారంభమయ్యాయి.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో లో ఎటు చూసిన బీడు భూములు బుక్కులు చేసి విత్తనాలు వేయని భూములు లు ఎండిపోతున్న వేరుశనగ మొలకలు, చుక్క నీరు లేని వ్యవసాయ బోర్లు, ఎండిపోతున్న పండ్ల తోటలు, వట్టిపోయిన చెరువులు కుంటలు, జలాశయాలు, వాగులు వంకలు కనపడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలను కదిలిస్తే వారి కళ్లల్లో కన్నీళ్లు, హృదయం లోని బాధలు వరదల లాగా పొంగి బయటకు వస్తున్నాయి.

Av- 1,2,3,4, yaddhulavarikota mahilalu
Av- 5 sivasankar Ad -vyavasaya sakha
Av- 6 viswanathaReddy -Raithu
Av- 7 lakshmiReddy - Raithu

R.sivareddy kit no 863 tbpl
8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.